గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తవలస మండలంలో చోటు చేసుకుంది. కొత్తవలస మండలం బలిఘట్టం నుండి ఎర్రవానిపాలెం మధ్యలో ఆదివారం విజయనగరం నుండి బైక్ పై వస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.