2023లో జరిగిన దొంగతనం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని కొత్తవలస పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. కొత్తవలస మండలం తుమ్మికాపల్లి లోని అచ్చియ్య శెట్టి ఇంట్లో రెండు తులాల బంగారు గొలుసు, 3 ఉంగరాల ను గంట్యాడ మండలం కొత్త వెలగాడకు చెందిన దాడి తరుణ్ కుమార్ దొంగిలించాడు. అప్పటినుండి పరారీలో ఉన్న తరుణ్ ను శుక్రవారం పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ షణ్ముఖరావు తెలిపారు.