ఎల్ కోట: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎంపీ శ్రీ భరత్

84చూసినవారు
ఎల్ కోట: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎంపీ శ్రీ భరత్
ఎల్ కోట మండలం గనివాడకు చెందిన చొక్కాకుల మల్లు నాయుడుకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 1,20,283 చెక్కును శనివారం విశాఖ ఎంపీ శ్రీ భరత్ చేతుల మీదుగా విశాఖ ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీ కొనియాడారు. రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్