జామి మండలం అట్టాడలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా సంభవించిన అగ్నిప్రమాదంలో ఆరు పశువుల శాలలు, రెండు నాటు బళ్ళతో సహా మూడు గడ్డి మేట్లు అగ్నికి ఆహుతయ్యాయి. గమనించిన స్థానికులు ఎస్. కోట అగ్రిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.