ఓబీ పాలెం లో వైద్య శిబిరం

85చూసినవారు
ఓబీ పాలెం లో వైద్య శిబిరం
వేపాడ మండలం ఓబీ పాలెం లో బొద్దాం పిహెచ్సి వైద్యులు శివాని ఆధ్వర్యంలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 25 మంది అవుట్ పేషెంట్స్ హాజరయ్యారని వీరిలో 14 మంది జ్వరపీడితులకు మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో ఇళ్ల ముందర ఐ ఎస్ ఎస్ స్ప్రే చేయించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పి ఎస్ ఆర్ మూర్తి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్