ఎంపీపీ పాఠశాలలను సందర్శించిన ఎంఈఓ

64చూసినవారు
ఎంపీపీ పాఠశాలలను సందర్శించిన ఎంఈఓ
వేపాడ మండలం కరకవలస ఎంపీపీ పాఠశాలను, సోంపురం జెడ్ పి హైస్కూల్ ను ఎంఈఓ పి.బాలభాస్కరరావు శనివారం ప్రార్థన సమయంలో సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, ఎన్రోల్మెంట్ డ్రైవ్ పరిశీలించి, విద్యార్థులతో చతుర్విధ ప్రక్రియలు చేయించారు. హెచ్ఎం బిపిఏ రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్