వేపాడ మండలం పాటూరు గ్రామంలోని శ్రీ జనార్ధన స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున పంచామృతాభిషేకం, అలంకరణ పిమ్మట భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. సాయంత్రం భజన బృందాలతో ఉరేగింపు, రేపు 108 పాత్రల పరమాన్నం నివేదన, బోగీ రోజు గోదాకళ్యాణం నిర్వహించనున్నారు.