కొత్తవలస మండలం రామలింగాపురం గ్రామ శివారులో గురువారం స్థానిక ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ సిఐ రాజశేఖర్ నాయుడు నాటు సారా స్థావరాలపై విజయనగరం ఈఎస్డిఎఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 400 లీటర్ల బెల్లపు ఊట ను గుర్తించి, ధ్వంసం చేశారు. ఎవరైనా నాటుసారా తయారుచేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో సిబ్బంది రాజు, వీర్రాజు, శ్రీను, దుర్గారావు పాల్గొన్నారు.