అసత్య ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు భూమన కరుణాకర రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. కొత్తవలస టిడిపి కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ. టీటీడీ చైర్మన్ గా భూమన ఉన్న కాలంలో అనేక కుంభకోణాలకు పాల్పడుతూ, స్వామివారి ఉనికినే ప్రశ్నించారని మండిపడ్డారు. అలాంటి నాస్తికుడు ప్రస్తుతం తిరుమల గోశాలలో గోవులు చనిపోయాయంటూ ఫేక్ ఫోటోలతో విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.