కొత్తవలస మండలం బలిఘట్టం సమీపంలో గల ఓ చెరువు వద్ద శనివారం 2 ఆవుల మృతదేహాలు హృదయ విదారకంగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆవులు మృతదేహాలను చూసిన స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సహజంగా చనిపోయాయా? లేదా ఎవరితోనైనా చంపబడ్డాయా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి సంబంధిత అధికారులు స్పందించి ఆవులు ఎవరికి చెందినవి, ఎలా చనిపోయాయో విచారణ చేపట్టాలని కోరుతున్నారు.