కొత్తవలస: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

72చూసినవారు
కొత్తవలస: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ముఖ్య ఉద్దేశ్యమని కొత్తవలస ఎంపీడీవో రమణయ్య అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఉల్లాస్ కార్యక్రమంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. ఉల్లాస్ యాప్ ద్వారా నేర్చుకునే వారి పేర్లను వాలంటీర్ టీచర్లు నమోదు చేయాలని తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్