కొత్తవలస మండలం సుంకరపాలెం గ్రామంలో రియల్ ఎస్టేట్ మాఫియా గ్రామంలోని చెరువును ఆక్రమించి రహదారి నిర్మాణం చేస్తున్నది. గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్, తహసిల్దార్ ఆదేశించినప్పటికీ, రాత్రిపూట శరవేగంగా పనులు కొనసాగించారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ గ్రామస్తులతో కలిసి అక్కడి పనులను ఆపివేసి, అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.