ఏపీలో కనుమరుగవుతున్న వాలంటీర్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియామకమైన కొత్తవలస వైస్ ఎంపీపీ కర్రి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును కొత్తవలసలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపీపీ గొరపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.