పూరి జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా కొత్తవలస మండలం మంగళ పాలెంలో గల గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాపర్తి జగదీష్ బాబు ఆధ్వర్యంలో శనివారం మంగళ పాలెం నుండి సింహాచలం కు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో విజయనగరం, విశాఖ, అరకు జిల్లాల నుండి సుమారు 2000 మంది భక్తులు హాజరై పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది పాదయాత్రగా సింహాచలం వెళ్లడం ఆనవాయితీగా వస్తోందని జగదీష్ బాబు తెలిపారు.