ఉద్యోగ సంఘాల వివిధ శాఖల నూతన ఆంగ్ల సంవత్సర డైరీ, క్యాలండర్ లను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో పలు శాఖల ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి సమష్టి తోడ్పాటు అవసరమన్నారు.