గిరిజన గ్రామం దబ్బగుంటలో పర్యటించిన ఆర్డిఓ

81చూసినవారు
గిరిజన గ్రామం దబ్బగుంటలో పర్యటించిన ఆర్డిఓ
ఎస్ కోట మండలం దబ్బగుంటలో ఆర్డీవో సూర్యకళ శనివారం పర్యటించారు. గ్రామంలో ప్రజారోగ్యంపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో నిరంతర పారిశుధ్య పనులు చేపట్టాలని, క్లోరినేషన్ చేసిన మంచినీరును ప్రజలకు సరఫరా చేయాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూస్ ఏఈ కిషోర్, ఎంఆర్ఓ కిరణ్ కుమార్, ఈ ఓ పి ఆర్ డి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్