జామి మండలం దొండపర్తి నుండి అలమండకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వర్షపు నీరు చేరి పెద్ద అగాధాలను తలపిస్తోంది. దీంతో అటుగా ప్రయాణించే వాహన చోధకుల అవస్థలు వర్ణనాతీతం. అలమండ రైల్వే స్టేషన్ కి వెళ్లేందుకు ఈ రోడ్డు గుండా ప్రయాణికులు వెళ్తుంటారని, వాహనదారులు ప్రమాదాలకు గురికాకముందే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వాహనదారుల తో పాటు ప్రజలు కోరుతున్నారు.