విద్యాహక్కు చట్టం (ఆర్ టి ఈ యాక్ట్ 2009) ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలని ఎంఈవో బి నరసింగరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. 5 సంవత్సరాలు నిండిన పిల్లలు ఒకటో తరగతి ప్రవేశాలకు అర్హులని తెలిపారు. లాటరీ పద్ధతి ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు.