ఎస్. కోట: పాఠశాలల నిర్మాణాలను పూర్తి చేయండి: ఎమ్మెల్యే

84చూసినవారు
ఎస్. కోట నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మంగళవారం అసెంబ్లీలో చర్చించారు. గత ప్రభుత్వంలో విజయనగరం జిల్లాల్లో 738 పాఠశాలల్లో తరగతి గదులు అభివృద్ధి చేస్తామని నిధులు మంజూరు చేశారని, అవి పక్కదారి పట్టించారని ఆరోపించారు. ప్రస్తుత విద్యా శాఖ మంత్రి వీటిపై దృష్టి పెట్టి తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్