రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎస్ కోట మండలం పెదకండేపల్లి గ్రామంలోని స్థానిక సాయిబాబా గుడి వద్ద నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మండల పార్టీ అధ్యక్షులు జి.ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.