ఎస్. కోట సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత గురువారం ఆకస్మికంగా సందర్శించి, పరిశీలించారు. జైల్లో రికార్డులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే జైలు సూపరిండెంట్ ద్వారా మండల న్యాయ సేవా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖైదీలకు మెనూ ప్రకారం భోజనం పంపిణీ చేయాలని కోరారు. విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని సూచించారు.