ఎస్. కోట: రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలి

52చూసినవారు
ఎస్. కోట: రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలి
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో రైతులు తమ వరి కోతలను వాయిదా వేసుకోవాలని ఎస్ కోట మండల ఏవో కె.రవీంద్ర తెలిపారు. గురువారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు ఆయన రైతుల వరి క్షేత్రాలను పరిశీలించారు. ఇప్పటికే వరి కోతలు కోసిన రైతులు పంటను ఎత్తైన ప్రదేశాల్లో కుప్పలుగా వేసుకోవాలని తెలిపారు. నూర్పులు వేసిన రైతులు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్