ఎస్ కోట మండలంలోని పలు ప్రాంతాలలో మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. వారం రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాతావరణం ఇలాగే అనుకూలించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వరి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.