ఎస్. కోట స్థానిక జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో గురువారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా విద్యార్థినిలకు పుస్తకాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో విద్యార్థుల కొరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ప్రతి విద్యార్థి తల్లులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించారన్నారు. మండల పార్టీ అధ్యక్షులు జి ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.