విశాఖ డైరీ పాల ఉత్పత్తిదారుల సంఘంలో పనిచేస్తున్న పిఎస్ లు, హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని గురువారం ఎస్ కోట విశాఖ డైరీ యూనిట్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కనీస వేతనం అమలు చేస్తూ ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని, పీఎస్ లకు రూ. 5 లక్షలు, హెల్పర్లకు రూ. 3 లక్షల గ్రాడ్యుటి ఇవ్వాలనే తదితర డిమాండ్లతో ఇన్చార్జి సురేష్ కు వినతి పత్రం అందజేశారు. డైరీ అభివృద్ధికి పాటుపడుతున్న తమకు యాజమాన్యం న్యాయం చేయాలని కోరారు.