ఒడిశా రాష్ట్రం కొరాపూట్ జిల్లాకు చెందిన గంజాయి వ్యాపారి గురుకు సంబంధించిన రూ. 42.70 లక్షల విలువైన ఆస్తులను ఎస్సీ నరుల్ జిందాల్ గురువారం సీజ్ చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 2024లో ఎస్.కోట పీఎస్ పరిధిలో 200 కిలోల గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించి, గంజాయి వ్యాపారంతో సంపాదించిన ఆస్తులను గుర్తించి అటాచ్ చేశారు.