ఎస్. కోట స్థానిక పుణ్యగిరి విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో 11 కె. వి లైన్ నిర్మాణం నేపథ్యంలో పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ సురేష్ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో ఆదివారం ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వాసుపత్రి పరిసర ప్రాంతాలు, తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, అయ్యప్ప లేఅవుట్, బర్మా కాలనీ, పుణ్యగిరి రోడ్డు, రేగ పుణ్యగిరి ప్రాంతాల్లో కరెంటు సరఫరా ఉండదని తెలిపారు.