ఇటీవల కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఎస్ కోట మండలం దాంపురంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరవడం తెలిసిందే. ఈ మేరకు ఆయన ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న నేపథ్యంలో తమ గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని కొంతకాలం నుండి త్రాగునీటి బోరు మరమ్మతులకు గురైందని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం ఈఓపిఆర్డి లక్ష్మి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన త్రాగునీటి బోరు మరమ్మతులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.