ఎస్ కోట: ప్రారంభం కానున్న బడి బస్సు

427చూసినవారు
ఎస్ కోట: ప్రారంభం కానున్న బడి బస్సు
ఎస్ కోట ఆర్టీసీ డిపో నుండి వేపాడ మండలం జాకేరు వరకు బడి బస్సును సోమవారం నుండి ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ కే రమేష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా గత కొన్నాళ్ల నుండి వేపాడ మండలానికి బడి బస్సు నడపవాలని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అధికారులకు విన్నవించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అభ్యర్థన మేరకు ఎస్. కోట నుండి జాకేరు వరకు బడి బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ జర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్