ఎస్ కోట మండలం వేములాపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో శనివారం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ప్రజలను ఆరా తీస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.