కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న జరగనున్న గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావమ్మ పిలుపునిచ్చారు. ఆదివారం ఎస్. కోట స్థానిక శ్రీనివాస కాలనీలో గోడపత్రిక విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు వ్యవసాయ, రైతు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలపాలని కోరారు.