ఎస్ కోట: మండలంలో మారిన వాతావరణం

79చూసినవారు
ఎస్ కోట మండలంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మంగళవారం ఉదయం నుండే ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. కాగా, మృగశిర కార్తె ప్రారంభం కావడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం ఇలాగే అనుకూలించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వరి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్