ఎస్ కోట లోని పుణ్యగిరి 11 కెవి ఫీడర్ పరిధి అలాగే 33/11 కె. వి విద్యుత్ లైన్లో మరమ్మతు పనులు నేపథ్యంలో పలు ప్రాంతాలకు కరెంటు సరఫరా ఉండదని ఈ ఈ సురేష్ బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు రాంనగర్, ఏవి హౌసెస్, పందిరప్పన్న జంక్షన్, పోలీస్ స్టేషన్ ఏరియా, రైల్వే స్టేషన్ రోడ్డు, ఎం కే రావు కాలనీ, చెరుకు కాటా, మెయిన్ రోడ్ నుండి దేవి కూడలి వరకు కరెంటు సరఫరా ఉండదని తెలిపారు.