ఎస్ కోట: భక్తులతో కిటకిటలాడిన వెంకటేశ్వర స్వామి దేవాలయాలు

1చూసినవారు
శృంగవరపుకోట మండల వ్యాప్తంగా పలు దేవాలయాలు ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా ఈ మధ్యన పుణ్యగిరిలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ఉదయం నుండే అధిక సంఖ్యలో వచ్చి క్యూలైన్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాలన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి. భర్త పురం, ఎస్ కోటలో ఉన్న పలు దేవాలయాలతో పాటు, సూర్య దేవాలయం కూడా భక్తులతో కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్