ఎస్ కోట మండలం తిమిడిలో శనివారం సర్పంచ్ వబ్బిన త్రినాధమ్మ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సచివాలయ ఉద్యోగులను వారి సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.