ఎస్ కోట: ఉపాధి హామీ కూలీలతో యోగాంధ్ర కార్యక్రమం

74చూసినవారు
ఎస్ కోట: ఉపాధి హామీ కూలీలతో యోగాంధ్ర కార్యక్రమం
ఎస్ కోట మండలం చినఖండేపల్లిలో 5 వేల మంది ఉపాధి హామీ కూలీలతో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, జేసీ సేతు మాధవన్ ఉపాధి కూలీలతో కలసి యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆయన అన్నారు. జూన్ 21న విశాఖలో పీఎం మోడీ సమక్షంలో జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్