యోగా అనేది గొప్ప సాధనమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎస్ కోట మండలం చినఖండేపల్లిలో మంగళవారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ తో కలసి ఆమె పాల్గొన్నారు. యోగా ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. యోగా ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియపరిచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. జేసీ సేతు మాధవన్ తదితరులు పాల్గొన్నారు.