సీమాంధ్ర ఉదయం ఎడిటర్ కన్నుమూత

76చూసినవారు
సీమాంధ్ర ఉదయం ఎడిటర్ కన్నుమూత
ఎస్ కోట పట్టణానికి చెందిన సీమాంధ్ర ఉదయం ఎడిటర్ వెలగా అశోక్ శనివారం కన్నుమూశారు. ఈయన గత కొన్ని రోజుల నుండి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా ఆరోగ్యం విషమించి శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో ఎస్. కోట నియోజకవర్గంలో గల విలేకరులు ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి తమ ప్రగాఢ సానుభూతిని అశోక్ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈయన మృతితో భార్యలక్ష్మి తదితర కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు.

సంబంధిత పోస్ట్