ఏజెన్సీల నుండి వచ్చిన వారు రక్తపరీక్షలు చేయించుకోవాలి

58చూసినవారు
ఏజెన్సీల నుండి వచ్చిన వారు రక్తపరీక్షలు చేయించుకోవాలి
ఏజెన్సీ ప్రాంతాలను పర్యటించి వచ్చినవారు రక్త పరీక్షలు చేయించుకోవాలని డిఎం అండ్ హెచ్ ఓ ఎస్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లాలో 96 మలేరియా, 73 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, పరిస్థితి అదుపులో ఉందన్నారు. జిల్లాలో 113 హైరిస్క్ గ్రామాల్లో మొదటి విడత ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ జరిగిందని, జులై 15 న రెండో విడత ఐ ఆర్ ఎస్ స్ప్రేయింగ్ చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్