విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం దేవుపల్లిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ యు.మహేష్ గురువారం తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.