వేపాడ: ఈనెల 21న ఆరో తరగతి ప్రవేశానికి అర్హత పరీక్ష

53చూసినవారు
వేపాడ: ఈనెల 21న ఆరో తరగతి ప్రవేశానికి అర్హత పరీక్ష
2025 - 26 విద్యా సంవత్సరానికి గాను వేపాడ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి ఈ నెల 21 న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రావాడ ఈశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన ఈనెల 20 న ఈస్టర్ పండుగ కారణంగా సెలవు దినం కావడంతో అర్హత పరీక్ష తేదీ మార్పు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్