వేపాడ మండలం బల్లంకి మాజీ సర్పంచ్ బల్లంకి నాగమయ్య మంగళవారం రాత్రి మృతి చెందారు. ఈయన సర్పంచ్ గా 1982 నుండి 1989 వరకు పనిచేసి గ్రామ అభివృద్ధికి పాటుపడ్డారు. అనారోగ్య కారణాలతో ఈయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన సర్పంచిగా పనిచేసిన కాలంలో గ్రామంలో ఎస్సీ కాలనీలోని ఇళ్లకు ఉచిత విద్యుత్ బల్బు సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం ఈయన కోడలు బల్లంకి సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు.