వేపాడ మండలం బక్కు నాయుడుపేట బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు 123 మందికి గాను 89 మంది విద్యార్థులు హాజరు కాగా, ఇంటర్ ప్రవేశ పరీక్షకు 76 మంది విద్యార్థులకు గాను 61 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షలను అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజు పర్యవేక్షించారు.