వేపాడ: రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినూత్న నిరసన

77చూసినవారు
వేపాడ మండలం బొద్దాం నుండి కళ్ళెంపూడికి వెళ్లే రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ కోరారు. ఆదివారం స్థానికులతో కలసి ఆయన రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో చేరిన నీటిలో కూర్చుని నిరసన తెలిపారు. గుంతల మయంగా మారిన రోడ్డు గుండా ప్రయాణించేందుకు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్