వేపాడ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గా టి జయశ్రీ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇన్చార్జి ప్రిన్సిపల్ గా పనిచేసిన యు ఉషారాణి విశాఖ జిల్లా నక్కపల్లి కి బదిలీపై వెళ్లారు. ఈ మేరకు ప్రిన్సిపల్ జయశ్రీ కి పాఠశాల సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని జయశ్రీ తెలిపారు. వియ్యం పేట, వేపాడ గురుకుల పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.