వేపాడ మండలం డిబీ పేట ఎంపీపీ పాఠశాల, మోడల్ పాఠశాలను గురువారం ఎంఈఓలు జి.జగదీశ్వరరావు, పి.బాల భాస్కరరావు సందర్శించారు. ముందుగా విద్యార్థులు ఆలపించిన ప్రార్థనా గీతాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. నిబంధనల మేరకు విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు.