వేపాడ మండలం కరకవలస గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం విశాఖ ఎంపీ శ్రీ భరత్, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో కలసి శంకుస్థాపన చేశారు. 7 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు నిర్మాణాలు చేపట్టడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఎమ్మెల్సీ రఘురాజు తదితరులు పాల్గొన్నారు.