కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. వేపాడ మండలం పాటూరులో ఆదివారం జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమని అన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.