యోగ చేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని వేపాడ ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక జడ్పీ హైస్కూల్ లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజలకు యోగ పై అవగాహన కల్పిస్తూ వల్లంపూడి నుండి వేపాడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈనెల 21న విశాఖలో పీఎం మోడీ ఆధ్వర్యంలో జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.