జామి మండలంలో గ్రామ సందర్శన కార్యక్రమం

52చూసినవారు
జామి మండలంలో గ్రామ సందర్శన కార్యక్రమం
జామి మండలం అలమండ గ్రామంలో గురువారం ఎంపీడీవో సతీష్ ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి, ప్రాథమిక పాఠశాలను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. ఈ మేరకు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి సత్వర కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈఓపిఆర్డి శ్రీదేవి తదితర అధికారులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్